తమిళ సినిమా నాట భారీ స్టార్డం స్టార్ హీరోస్ లో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి అజిత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “విడా ముయార్చి” కోసం అభిమానులు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే అజిత్ హీరోగా ఇప్పుడుకి కూడా ఎన్నో రిస్కీ ఫీట్స్ చేస్తూనే వస్తున్నాడు. మరి ఈ క్రమంలో అజిత్ హాస్పిటల్ లో చేరాడు అనే వార్తలు ఫ్యాన్స్ లో కొంచెం టెన్షన్ తీసుకొచ్చాయి.
అయితే దీనిపై అసలు క్లారిటీ తెలుస్తుంది. అజిత్ ఏమి అస్వస్థకు లోనయ్యో లేక తనకి గాయలయ్యో హాస్పిటల్ లో చేరలేదట. తాను కేవలం జెనరల్ చెకప్ కోసమే తమిళ నాట అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడని తెలుస్తుంది. ఈ చెకప్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ తన సినిమా షూటింగ్ అజర్ బైజాన్ లో ప్లాన్ చేసిన షెడ్యూల్ లో జాయిన్ అవుతాడని కూడా కోలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. దీనితో ఫ్యాన్స్ అయితే ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదని చెప్పాలి.