యంగ్ హీరోకి దీపికా లాంటి భార్య కావాలట..!

Published on Jun 4, 2020 11:50 pm IST


బాలీవుడ్ యంగ్ హీరో ఆర్యన్ కార్తీక్ హీరోయిన్ దీపికా పదుకొనెపై మరోమారు అభిమానం చాటుకున్నారు. మీకు కాబోయే భార్య ఎలా ఉండాలని అడిగితే దీపికా పదుకొనె లా ఉండాలని చెప్పాడు. దానికి కారణం దీపిక తన భర్త రణ్వీర్ సింగ్ ని ఎంతగానో ప్రేమిస్తుందంట. అతని పట్ల ఆమె చాలా కేరింగ్ గా ఉంటుందట. అలాంటి, కేరింగ్ అండ్ డార్లింగ్ వైఫ్ కావాలని ఆర్యన్ కార్తీక్ కోరుకున్నాడు.

ఇక ఆర్యన్ కార్తీక్ గతంలో కూడా దీపికకు పెద్ద అభిమానిని అని చెప్పుకున్నారు. ఆయన నటించిన లవ్ ఆజ్ కల్ ఇటీవల విడుదల అయ్యింది. భూల్ బులయా2, దోస్తానా 2 చిత్రాలతో ఆర్యన్ కార్తీక్ నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాలలో భూల్ బులయా2 మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More