ఆశిష్ సెకండ్ మూవీ ‘సెల్ఫీష్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం !

ఆశిష్ సెకండ్ మూవీ ‘సెల్ఫీష్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం !

Published on Dec 5, 2022 1:47 PM IST

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుండి వచ్చిన యువ నటుడు ఆశిష్, ఫస్ట్ మూవీ రౌడీ బాయ్స్ తో ఇటీవల ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి మంచి సక్సెస్ అందుకుని ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న సెకండ్ మూవీ సెల్ఫిష్. యువ దర్శకుడు విశాల్ కాశీ దర్శకుడిగా పరిచయం అవుతూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో పాటు మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌ తో కలిసి సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూట్ సోమవారం నుండి హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఈ మూవీలో హీరో ఆశిష్ పూర్తి మాస్‌లుక్‌లో స్టెలిష్‌గా కనిపిస్తారని అలానే వైవిధ్యమైన కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ పూర్తి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ అని అన్నారు. ఇంకా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని ఎస్. మణికందన్, లిరిక్స్ ని చంద్రబోస్, ఆర్ట్ డైరెక్షన్ ని కిరణ్‌కుమార్ మన్నె అందిస్తుండగా సహ నిర్మాతలుగా హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ మూవీకి సంబదించిన ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు