‘త్రిష’ కామెంట్స్ పై విజయ్ ఫ్యాన్స్ సీరియస్

‘త్రిష’ కామెంట్స్ పై విజయ్ ఫ్యాన్స్ సీరియస్

Published on Jan 5, 2025 5:40 PM IST

హీరోయిన్ త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట కలయికలో వస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తోంది. పైగా రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో స్టార్ హీరోయిన్ గా త్రిష రాణిస్తోంది. ఈ నేపథ్యంలో త్రిష రాజకీయాల పై చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని త్రిష ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సామాజిక సమస్యలపై పోరాటంతో పాటు ప్రజా సేవ చేయాలని ఉందంటూ రాజకీయాలపై తన ఆసక్తిని త్రిష బయటపెట్టింది.

త్రిష చేసిన ఈ కామెంట్స్ పై తమిళ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. విజయ్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘తమిళగ వెట్రి కళగం’ అనే రాజకీయ పార్టీని విజయ్ స్థాపించారు. తన పార్టీకి సంబంధించిన జెండాను కూడా విజయ్ ఆవిష్కరించారు. విజయ్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో త్రిష తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అంటూ కామెంట్స్ చేయడం వారికి నచ్చలేదు. అన్నట్టు తమిళనాట సినీ స్టార్లు ఎంజీఆర్, జయలలిత సీఎంలుగా పనిచేసిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు