‘ఖైదీ – 2’ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరో కార్తీ

‘ఖైదీ – 2’ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరో కార్తీ

Published on Nov 2, 2023 7:33 PM IST


కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జపాన్. భారీ స్థాయిలో రూపొందిన ఈ మూవీ రానున్న దీపావళి కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా హీరో కార్తీ, తన ఖైదీ 2 మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

తన కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే క్యారెక్టర్స్ లో ఖైదీ లో ఢిల్లీ క్యారెక్టర్ ఒకటని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, నిజానికి ఖైదీ 2 మూవీ 2024 జనవరిలో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఒక మూవీ ఒప్పుకోవడంతో అది కొన్నాళ్ల పాటు వాయిదా పడిందని అన్నారు. అయితే ఖచ్చితంగా రజిని గారి ప్రాజక్ట్ అనంతరం ఖైదీ 2 ఉంటుందని తెలిపారు కార్తీ. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఖైదీ మూవీ 2019 లో రిలీజ్ అయి అతి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు