తండ్రయిన హీరో నితిన్.. మగబిడ్డకు జన్మనిచ్చిన షాలిని

టాలీవుడ్ హీరో నితిన్ తండ్రిగా మారాడు. ఆయన భార్య షాలిని మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. జూలై 16, 2020లో నితిన్-షాలిని వివాహం జరిగింది. ఈ జంట త్వరలో తల్లిదండ్రులుగా మారుతున్నామని ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని నితిన్ పేర్కొన్నారు. తమ అభిమాన హీరో తండ్రిగా మారడంతో నితిన్ ఫ్యాన్స్ ఆయనకు నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నితిన్, షాలిని జంట తల్లిదండ్రులుగా మారడంతో ఇరువురి కుటుంబ సభ్యులు వారికి విషెస్ చెబుతున్నారు.

ఇక నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్‌హుడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Exit mobile version