ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో #RAPO19 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది.
అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న అలికిడి ప్రకారం ఈ చిత్రం ఆడియో హక్కులకు భారీ ధర లభించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం యొక్క తెలుగు, తమిళ ఆడియో హక్కులను కొనుగోలు చేసేందుకు ఆదిత్య మ్యూజిక్ రూ.2.75కోట్లు వెచ్చించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఆడియో హక్కుల విషయంలో రామ్ కి ఇది కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ సరసన కృతిశెట్టి నటిస్తుండగా, ఆది పినిశెట్టి కీలకపాత్రలో నటిస్తున్నారు.