మరోసారి హీరో రామ్ సిక్స్ ప్యాక్ చూపించబోతున్నాడట?

Published on Jan 20, 2022 2:33 am IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ది వారియ‌ర్‌’. ఇందులో రామ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కనిపించబోతున్నాడు. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పిని శెట్టి విల‌న్‌గా నటిస్తున్నాడు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ సినిమాలోని పాత్ర కోసం రామ్ కండలు పెంచాడని, మరోసారి తెరపై సిక్స్ ప్యాక్ చూపించనున్నాడని టాక్ నడుస్తుంది. ఇదివరకే “ఇస్టార్ట్ శంకర్” చిత్రంలో సిక్స్ ప్యాక్ చూపించి మంచి మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు రామ్. ఆ తర్వాత “రెడ్” చిత్రంతో పర్వాలేదనిపించాడు. మరి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా ఎలా మెప్పిస్తాడనేది చూడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :