సత్యదేవ్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లు గా దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం రాగాల 24గంటల్లో . శ్రీనివాస్ కానూరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో శ్రీరామ్ ఓ కీలకపాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ చిత్ర విశేషాలు పంచుకున్నారు.
మీరు ఈ చిత్రంలో ఎలా భాగం ఐయ్యారు?
నేను అందరికంటే చివరిగా ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యాను. నేను తెలుగులో ‘అసలేం జరిగింది’ అనే సినిమా షూటింగ్ లో పాల్గొని చెన్నైకి వెళ్లిన తరువాత నాకు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి ఈ మూవీ లైన్ నెరేట్ చేశారు. ఆ లైన్ నచ్చడంతో నేను చేయడానికి ఒప్పుకున్నాను.
రాగాల 24గంటల్లో ఎలాంటి మూవీ?
ఇది సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ అండి. ఒక మర్డర్ చుట్టూ మూవీ కథ నడుస్తుంది. లేడీ సెంట్రిక్ సబ్జెక్టు మూవీ అని చెప్పొచ్చు. చాలా ఉత్కంఠగా మూవీ సాగుతుంది.
ఈ చిత్రంలో మీరు నటించాడని కారణం?
శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసినప్పుడు నా పాత్ర కాదు, కథ చెప్పమన్నాను. ఈ మూవీలో సబ్జెట్ నే హీరో. ప్రతి పాత్రకు కథలో ప్రాధాన్యం ఉంటూ ఉత్కంఠగా సాగే కథ ఇది.
మర్డర్ మిస్టరీ మూవీస్ చాలా వచ్చాయి కదా?
మర్డర్ మిస్టరీ కథాంశతో చాలా సినిమాలు గతంలో తెరకెక్కాయి. ఐతే ప్రతి దర్శకుడు కొత్తగా చెప్పాలని ప్రయత్నిస్తారు. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఒక భిన్నమైన ట్రీట్మెంట్ తో ఈ సబ్జెక్టు ని తెరకెక్కిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ టైటిల్స్ ఐపోయిన వెంటనే అసలు కథలోకి వెళ్ళిపోతుంది. క్యరెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కథను సాగదీయడం ఉండదు.
ఈ చిత్రంలో మీ పాత్ర ఏమిటీ?
నేను ఓ పోలీస్ రోల్ చేస్తున్నాను. గతంలో కూడా పోలీస్ పోలీస్ చిత్రంలో ఈ తరహా పాత్ర చేయడం జరిగింది. కానీ ఈ మూవీలో ఇంకా మెచ్యూర్డ్ గా, డెప్త్ గా నా పాత్ర ఉంటుంది. ప్రస్తుతం తమిళంలో కూడా ఒక మూవీలో ఇలాంటి పాత్ర చేస్తున్నాను.
తెలుగులో సినిమాలు చేయడం లేదు ఎందుకని?
మంచి స్క్రిప్ట్స్ దొరకకపోవడం వలనే తెలుగులో చిత్రాలు చేయడం లేదు. తెలుగు సినిమాలలో నటించడానికి నేనెప్పుడూ సిద్దమే. ప్రస్తుతం అసలేం జరిగింది అనే చిత్రంతో పాటు, కొత్త దర్శకుడు మధుకర్ తో ఒక తెలుగు సినిమా చేస్తున్నాను. ఈ చిత్రానికి మని శర్మ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.
రాగాల 24గంటలలో అని టైటిల్ పెట్టడానికి కారణం?
ఈ మూవీ స్క్రిప్ట్ మొత్తం 24 గంటలలో నడిచే కథ. మనకు ఎప్పటినుండో వాతావరణ ఉపద్రవాల గురించి రేడియోలలో చెప్పేటప్పుడు రాగాల 24గంటలలో అని చెబుతారు. అందుకే ఈ కథకు ఈ టైటిల్ సరిపోతుందని అలా పెట్టడం జరిగింది.
మీకు ఇష్టమైన జోనర్ ఏమిటీ?
నాకు లవ్ ఎంటర్టైనర్ లలో నటించడం చాలా ఇష్టం. తెలుగులో లవ్ ఎంటర్టైనర్స్ వస్తున్నాయి. కానీ అరవంలో మాత్రం రావడం లేదు.
తమిళంలో ప్రస్తుతం ఎన్ని చిత్రాలు చేస్తున్నారు?
తమిళంలో దాదాపు 6 చిత్రాలలో హీరోగా చేస్తున్నాను. వీటిలో ఒకటి ధనుష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు 50 శాతం వరకు పూర్తయింది, ఈ మూవీలో నాగార్జున కూడా భాగస్వామ్యం ఉంది. లక్ష్మీ రాయ్ హీరోయిన్ గా ఒక చిత్రం, హన్సిక తో మరొక చిత్రం ఇలా కొన్ని చిత్రాలు చేస్తున్నాను.