“హరోం హర” తో తన ట్యాగ్ మార్చుకున్న సుధీర్

“హరోం హర” తో తన ట్యాగ్ మార్చుకున్న సుధీర్

Published on Jun 14, 2024 10:08 AM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మంచి టాలెంటెడ్ అండ్ సాలిడ్ ఫిజిక్ ఉన్న హీరోస్ లో సుధీర్ బాబు కూడా ఒకడు. సుధీర్ హీరోగా ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చాడు. అలాగే ఒక నటుడిగా కూడా ఒకో సినిమాకి చాలా వేరియేషన్ ని చూపిస్తూ తాను వస్తున్నాడు. అయితే మన టాలీవుడ్ లో అందరి హీరోస్ కి ఉన్నట్టుగానే సుధీర్ బాబుకి ఇది వరకే ఒక ఇంట్రెస్టింగ్ ట్యాగ్ ఉండేది.

తనలోని ఉన్న పొటెన్షియల్ కి తగ్గట్టుగా నైట్రో స్టార్ అనే ట్యాగ్ ని తన గత రెండు మూడు సినిమాల నుంచి పడింది. అయితే మన హీరోస్ లో తమకి మరింత బ్రేక్ ఇచ్చే సినిమా నుంచి కొత్త ట్యాగ్ లు మారుతున్నాయి. అభిమానులు కూడా మార్చేస్తున్నారు.

అలా సుధీర్ నుంచి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్యాగ్ “నవ దళపతి”. ఇప్పుడు తాను నటించిన చిత్రం “హరోం హర” కి నవ దళపతి సుధీర్ గా తాను పరిచయం అయ్యాడు. దీనితో తన ఈ సరికొత్త ట్యాగ్ మంచి వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రాన్ని జ్ఞ్యానసాగర్ ద్వారకా దర్శకత్వం వహించగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు