రిలీజ్ తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో “తంగలాన్” ను ప్రమోట్ చేస్తున్న విక్రమ్!

రిలీజ్ తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో “తంగలాన్” ను ప్రమోట్ చేస్తున్న విక్రమ్!

Published on Aug 18, 2024 8:03 AM IST

తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే, ఏ చిత్రాన్నైనా ఆదరిస్తారు. ఇతర భాషల నుండి డబ్ అయిన చిత్రాలు సూపర్ సక్సెస్ ను సాధించడం మనం చూశాం. ఇప్పుడు విక్రమ్ నటించిన తంగలాన్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. సినిమా రిలీజ్ తర్వాత కూడా హీరో విక్రమ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రమోట్ చేస్తున్న తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఒక స్టార్ హీరో ఈ రేంజ్ లో చేయడం పట్ల సినిమా పై అందరిలో ఆసక్తి పెరుగుతూ ఉంది.

తంగలాన్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో జోరు మీద ఉన్నాయి. ఈ వారం తెలుగు చిత్రాల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ, తంగలాన్ కి వస్తున్న రెస్పాన్స్ గొప్ప విషయం. దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కీలక పాత్రలో నటించింది. స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు