చివరి షెడ్యూల్ స్టార్ట్ చేసిన విశాల్ “సామాన్యుడు”..!

Published on Sep 15, 2021 12:44 am IST

యాక్షన్ హీరో విశాల్‌ హీరోగా, కొత్త దర్శకుడు శరవణన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘సామాన్యుడు’. ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌’ అనేది ఈ సినిమాకి ట్యాగ్‌లైన్. ఇంటెన్స్‌ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్ట‌ర్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

అయితే డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ మంగళవారం మొదలైంది. సమాజంలో జరిగే అన్యాయాన్ని సహించలేని ఓ ఆవేశ పరుడి కథే “సామాన్యుడు”. ఈ సినిమాలో విశాల్ స‌ర‌స‌న‌ టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తుండగా, యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పి.ఎ. తులసి, రవీనా రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :