తన తెలుగు డబ్బింగ్ సీక్రెట్ చెప్పేసిన హీరో విశాల్..!

తన తెలుగు డబ్బింగ్ సీక్రెట్ చెప్పేసిన హీరో విశాల్..!

Published on Sep 22, 2021 3:07 AM IST


యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్యల క్రేజీ కాంబినేష‌న్‌లో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ “ఎనిమీ”. మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రంలో మృణాళిని రవి, మమత మోహన్ దాస్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ క్రేజీ మల్టీ స్టారర్ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.

అయితే తాజాగా హీరో విశాల్ ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పాడు. అయితే డబ్బింగ్ చెబుతూ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ లాగా ఇలా చేతులు ఊపితేనే నాకు తెలుగులో డబ్బింగ్‌ వస్తుందని ఫన్నీగా చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫన్నీ కామెంట్స్ వైపు ఓ లుక్కేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు