రంగస్థలం మూవీలో చరణ్, సమంతల పల్లెటూరి ఇన్నోసెంట్ రొమాన్స్ సూపర్ క్లిక్ అయ్యింది. 90ల కాలం నాటి అమ్మాయి, అబ్బాయిల పల్లెటూరి ప్రేమ కథను సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. చెవిడివాడైన చిట్టిబాబు కి తన ప్రేమను చెప్పే క్రమంలో రామ లక్ష్మీ పడే ఇబ్బందిని చాలా ఫన్నీగా చెప్పాడు సుకుమార్. ఓ సందర్భంలో సమంత తనంటే ఇష్టం అని చెవుతుంటే చెవుతుంటే, వినబడని చరణ్ చవట, వెధవ అని తిడుతుందని భ్రమపడతాడు.
థియేటర్స్ హిలేరియస్ గా పేలిన ఆ సన్నివేశాన్ని యంగ్ హీరోయిన్ దీక్షా పంత్ టిక్ టాక్ వీడియో చేసి సోషల్ మీడియాలో పంచుకుంది. సమంతను అనుకరిస్తూ ఆమె ఇచ్చి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మెస్మరైజింగ్ గా ఉన్నాయి. నెటిజెన్స్ కి ఆ వీడియో తెగ నచ్చేడంతో లైకులు కొడుతూ వైరల్ చేస్తున్నారు. ఇక దీక్షా పంత్ తెలుగులో అనేక చిత్రాలతో నటించింది. గోపాల గోపాల, ఒక లైలా కోసం వంటి చిత్రాలలో నటించింది. ఆమె తెలుగులో మూడు చిత్రాల వరకు చేస్తుంది.