‘కళ్యాణం కమనీయం’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. తన నటనతో మెప్పించే ఈ బ్యూటీ తమిళంలో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియా భవానీ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ప్రియా భవానీ శంకర్ ఏం మాట్లాడింది అంటే.. ‘ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి గ్లామర్‌గా కనిపించడం నాకు నచ్చదు. అలాంటి బోల్డ్ రోల్స్ ని నేను అంగీకరించను. కెరీర్ పరంగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను’ అని ఆమె తెలిపింది,
ప్రియా భవానీ శంకర్ ఇంకా మాట్లాడుతూ.. ‘అందుకే, నా శరీరాన్ని ఒక వస్తువుగా నేను భావించను. అందాలు చూపించి అవకాశాలు అందుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే, సినిమాల ఎంపిక విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా. అయితే, నెగెటివ్ రోల్ చేయడానికీ వెనుకాడను. ఎందుకంటే అది నా వృత్తి. అలాగే, ఒక హీరోయిన్ గా ఫ్యాషన్ పేరుతో అందాలను మాత్రం ప్రమోట్ చేయలేను’ అని ఆమె కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో తన తదుపరి సినిమా ‘బ్లాక్’ ను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.