అక్కినేని అఖిల్ సరసన ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సయేషా సైగల్ . ఈ చిత్రం తరువాత తెలుగులో మాత్రం ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ హీరోయిన్ గా మారింది. కడై కుట్టి సింగం, గజినీకాంత్ చిత్రాల్లో నటించింది. గజినీకాంత్ సినిమా చేస్తోన్న సమయంలోనే ఆ చిత్ర హీరో ఆర్యతో ప్రేమలో పడింది.
కాగా వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ.. వాలెంటైన్స్ డే సందర్భంగా హీరో ఆర్య తాము ప్రేమించుకుంటున్నట్లు.. తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించినట్లు ఆర్య సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలిపారు. అయితే వీరు పెళ్లి తేది ఎప్పుడో ఇంకా తెలియాల్సి ఉంది.