‘లియో’ నటుడి వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన హీరోయిన్ త్రిష

‘లియో’ నటుడి వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన హీరోయిన్ త్రిష

Published on Nov 19, 2023 12:07 AM IST


ఇటీవల లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష కలిసి నటించిన గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ లియో. మంచి అంచనాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ తెరకెక్కగా కీలక పాత్రల్లో గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ ఆలీ ఖాన్ నటించారు. విషయం ఏమిటంటే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ త్రిష పై ఒకింత జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ తనకు ఈ సినిమాలో రేప్ సీన్ రాలేదని బాధపడ్డానని, ఇటీవలి చిత్రాలలో తనకు రేప్ సన్నివేశాలు ఇవ్వడం లేదన్నారు.

త్రిషతో కలిసి నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో బెడ్రూమ్ సీన్ ఉంటుందని భావించి నా మునుపటి సినిమాల్లో మాదిరిగా ఆమెను కూడా బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నానన్నారు. చాలా సినిమాల్లో రేప్ సన్నివేశాలు చేశా, అవేమీ నాకు కొత్త కాదు కానీ ఈ కుర్రాళ్ళు కాశ్మీర్ షెడ్యూల్ సమయంలో సెట్స్ లో కూడా త్రిషను నాకు చూపించలేదన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల పై తాజాగా హీరోయిన్ త్రిష తన ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు. మన్సూర్ ఆలీ ఖాన్ తన పై చేసిన వ్యాఖ్యలు అసహ్యంతో పాటు చాలా బాధని కూడా కలిగించాయన్నారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

ఆయన వ్యాఖ్యల్లో విశృంఖల, అగౌరవం, స్త్రీ ద్వేషం కనిపిస్తున్నాయి. అతనిలాంటి దారుణమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్ ని పంచుకోనందుకు నేను కృతజ్ఞురాలిని, నా మిగిలిన సినిమా కెరీర్లో కూడా అతనితో నటించకుండా చూసుకుంటాను. అతనిలాంటి వ్యక్తులు మానవాళికి చెడ్డ పేరు తెస్తారని ఆమె తన పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా పలువురు నెటిజన్స్ త్రిషకి మద్దతు పలుకుతూ మీకు మేమున్నాం మేడం అధైర్య పడకండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు