తమిళ హీరో శివ కార్తికేయర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమరన్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేయగా, మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితగాధ అధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ మెలోడి సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.
‘హే రంగులే’ అంటూ సాగే ఈ అందమైన మెలోడి సాంగ్‌కు మ్యూజిక్ డైరెక్టర్ జీవి.ప్రకాశ్ కుమార్ తనదైన బాణీలను అందించాడు. ఈ పాట ఆయన కెరీర్లో 700వ పాటగా ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ పాట తెలుగు వెర్షన్ ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, అనురాగ్ కుల్కర్ణి, రమ్య బెహ్రా ఈ పాటను ఆలపించారు.
ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.