యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నవంబర్ 8న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేయగా ఇటీవల ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయ్యింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.
ఇక ఈ సినిమా నుండి తాజాగా ‘హే తార’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాట పూర్తి మెలోడి సాంగ్‌గా ఉండటంతో ప్రేక్షకులకు నెమ్మదిగా ఎక్కుతోంది. ఈ సినిమాలో నిఖిల్ లవర్ బాయ్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇక దర్శకుడు సుధీర్ వర్మ కంటెంట్‌పై ప్రేక్షకుల్లో నమ్మకం ఉండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాలో అందాల భామలు రుక్మిణి వాసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌విసిసి బ్యానర్‌పై ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.