‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ సాంగ్ పై కొత్త అప్ డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ని తిరిగి స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 28న, 2025న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఐతే, ఈరోజు ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలోని కీలక తారాగణం ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. అన్నట్టు ఈ చిత్రం నుండి మొదటి సింగిల్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి శుభ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ పాట తెలుగు వెర్షన్‌కు పవన్ కళ్యాణ్ స్వయంగా తన గాత్రాన్ని అందించడం విశేషం.

కాగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version