హిందీ ఇస్మార్ట్ శంకర్ పరిస్థితి ఏంటి ?

Published on Nov 29, 2020 2:06 am IST


గత నాలుగేళ్లుగా బాలీవుడ్ నిర్మాతల చూపు టాలీవుడ్ సినిమాల స్టోరీల పై పడింది. ఈ మధ్య ఇక్కడ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు బాగా ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో.. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్100’, ఎవడు సినిమాలను కూడా రీమేక్ చేస్తున్నారు. కాగా మరొక తెలుగు సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కూడా రీమేక్ అవుతుందని.. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా ఈ సినిమాలో నటించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అయితే ఆ తరువాత మొదలైంది అన్నారు. షూటింగ్ జరుగుతుంది అన్నారు. కానీ మళ్లీ ఈ సినిమాకి బ్రేక్ పడింది అంటున్నారు. మరి ఈ సినిమా పరిస్థితి ఏమిటో మేకర్స్ నుండి క్లారిటీ వచ్చేవరకూ ఆగాల్సిందే. ఇక హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. మరి రణ్ వీర్ సింగ్ కి కూడా ఈ సినిమా సూపర్ హిట్ ని ఇస్తుందా..? చూడాలి. అన్ని కుదిరితే ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉందట. ఇక ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల గురించి, సినిమా వివరాల గురించి తెలియాల్సి ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More