హిందీ ఆడియెన్స్ కూడా రీమేక్స్ కి మొహం చాటేస్తున్నారా!?

హిందీ ఆడియెన్స్ కూడా రీమేక్స్ కి మొహం చాటేస్తున్నారా!?

Published on Dec 27, 2024 8:08 PM IST

ఇపుడు ఉన్న ట్రెండ్ లో రీమేక్ సినిమాలు హిట్ అవ్వడం అంటే అది గగనమే అని చెప్పాలి. ఇక ఆ సినిమా ఈ హీరో పర్ఫెక్ట్.. న్యూట్రల్ ఆడియెన్స్ లో కూడా ఓ సినిమా ఓ స్టార్ రీమేక్ చేస్తున్నాడు అని ఇంట్రెస్ట్ చూపిస్తే తప్ప ఇప్పుడున్న ఓటిటి యుగంలో ఆ సినిమా హిట్ అవ్వడం అటుంచితే పెట్టిన బడ్జెట్ కి వసూళ్లు కూడా అందుకోవడం లేదని చెప్పాలి. అయితే ఇది ఒక్క తెలుగు లోనే కాకుండా హిందీ మార్కెట్ లో కూడా కొనసాగుతుంది అని చెప్పాలి.

ఈ మధ్య కాలంలో హిందీలో కూడా ఒకటీ రెండు సినిమాలు తప్ప మిగతా ఏ రీమేక్ వర్కౌట్ కావడం లేదు. ఇలానే లేటెస్ట్ గా వచ్చిన “బేబీ జాన్” పరిస్థితి ఏర్పడింది. దళపతి విజయ్ నటించిన ‘పోలీస్’ సినిమాకి రీమేక్ గా బాలీవుడ్ లో వరుణ్ ధావన్ అలాగే కీర్తి సురేష్ నటించారు. అయితే ఈ చిత్రం ఎన్నో ప్రమోషన్స్ చేసినప్పటికీ డే 1 షాకింగ్ గా చాలా తక్కువ ఓపెనింగ్స్ అందుకుంది. ఇక రెండో రోజుకి అయితే అందులో సగం కూడా రాలేదు. దీనితో హింది జనం కూడా రీమేక్స్ పట్ల మరీ అంత ఆసక్తిగా లేరనే చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు