మన టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల్లో దర్శకుడు సుకుమార్ కూడా ఒకరు. మరి తాను చేసిన ఇన్ని సినిమాల్లో లేటెస్ట్ గా వచ్చిన సాలిడ్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” రికార్డు వసూళ్లు అందుకొని అదరగొడుతుంది. అయితే లేటెస్ట్ గా సుకుమార్, తన హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం “గేమ్ ఛేంజర్” డల్లాస్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ గా మారాయి. అయితే ముందుగా తాను సినిమాలు వదిలేస్తాను అన్నట్టుగా చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి.
కానీ దానితో పాటుగా మరో కామెంట్ ఇపుడు వైరల్ గా మారింది. తాను చేసిన చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన “1 నేనొక్కడినే” తర్వాత ఆల్మోస్ట్ సినిమాలు ఆపేద్దాం అన్నట్టు తన పరిస్థితి అయ్యిందని. కానీ తన కెరీర్ మళ్ళీ కొనసాగించడానికి కారణం ఆ సినిమాకి యూఎస్ లో వచ్చిన వసూళ్లు మాత్రమే కారణం అని తాను తెలిపారు. అక్కడ ఆ సినిమా పెర్ఫామ్ చేసి మంచి వసూళ్లు అందించడం వల్లే ఇపుడు ఇలా ఉన్నానని తెలిపారు. అందుకు యూఎస్ ఆడియెన్స్ కి స్పెషల్ థాంక్స్ ని సుకుమార్ తెలియజేసారు.