ఒక హిట్ తో కెరీర్ మలుపు తిరిగింది !

ఒక హిట్ తో కెరీర్ మలుపు తిరిగింది !

Published on Dec 5, 2022 3:03 PM IST

‘హిట్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. మేకర్స్ ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు. అయితే, ఈ సినిమా అటు నిర్మాతలకు , బయ్యర్లకు మాత్రమే కాదు.. నటీనటులకు చాలా ప్లస్ కానుంది. ఈ సినిమాతో అడవి శేష్ మార్కెట్ పెరిగింది. అలాగే.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఆమె నటన మరియు స్క్రీన్ ప్రెజెన్స్ కు చాలా ప్రశంసలు వచ్చాయి.

ఎలాగూ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అందుకే.. ఈ సినిమాతో మీనాక్షి చౌదరి రేంజ్ పెరిగింది. ఆమె ఇప్పుడు క్రేజీ హీరోయిన్ల లిస్ట్ లో బాగా పాపులర్ అయింది. చాలా మంది నిర్మాతలు తమ సినిమాల్లో ఆమెకు ఛాన్స్ లు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మీనాక్షిచౌదరి రెండు ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుపుతోంది. మొత్తానికి ఆమె కెరీర్‌ హిట్ 2 చిత్రంతో మంచి మలుపు తిరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు