నాని “హిట్ 3” షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!?

నాని “హిట్ 3” షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!?

Published on Jul 16, 2024 11:00 PM IST

టాలీవుడ్ హీరో, నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తదుపరి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ ఆగస్ట్ 29 వ తేదీన భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం తరువాత దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మరియు హిట్ 3 చిత్రాలు చేయనున్నారు హీరో నాని.

అయితే హిట్ 3 చిత్రం షూటింగ్ పై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. ఆగస్ట్ నెలలోనే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. అయితే కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్న శ్రీ నిధి శెట్టి ఈ హిట్ 3 లో భాగం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేకర్స్ నుండి ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. అడివి శేష్ నటించిన హిట్ 2 లో క్లైమాక్స్ లో కనిపించారు హీరో నాని. చాలా పవర్ ఫుల్ గా ఈ హిట్ 3 ఉండబోతుంది అని టాక్. శైలేష్ కొలను హీరో నాని ను ఎలా ప్రెజెంట్ చేస్తారో అని ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు