హైదరాబాద్ లో “హిట్ 3” షూటింగ్ షురూ!

హైదరాబాద్ లో “హిట్ 3” షూటింగ్ షురూ!

Published on Sep 13, 2024 8:30 PM IST

నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది సరిపోదా శనివారం చిత్రంతో మరొక సూపర్ హిట్ సాధించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా అలరించింది. ఈ చిత్రం తర్వాత హిట్ 3 చిత్రాన్ని నాని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. నేడు హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. హీరో నాని ఇందులో అర్జున్ సర్కార్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే హిట్ 1 మరియు హిట్ 2 చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శైలేష్ కొలను ఈ హిట్ 3 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రంలో నాని వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది. హిట్ 2 చివర్లో ఈ రోల్ గురించి ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. నాని ను పూర్తి స్థాయిలో పోలీస్ ఆఫీసర్ గా చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది మే 1, 2025 న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు