హిట్ 3 ట్రైలర్ టాక్: భయంకరమైన పోలీస్ గా మారిన నాని !

హిట్ 3 ట్రైలర్ టాక్: భయంకరమైన పోలీస్ గా మారిన నాని !

Published on Apr 14, 2025 12:48 PM IST

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులు అలరించేందుకు సిద్ధమైంది. ఇక నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిట్ 3 ట్రైలర్ విడుదలైంది. 3 నిమిషాల 32 సెకన్ల ఈ ట్రైలర్ అభిమానులు ఆశించిన స్థాయిలోనే ఉంది. ఉత్కంఠను కలిగించే విధంగా ప్రతి షాట్ సాగింది. దీనికి తోడు తీవ్రమైన యాక్షన్, అండ్ క్రూరమైన విజువల్స్ ఆకట్టుకున్నాయి.

మొత్తానికి ఈ ట్రైలర్‌ రక్తంలో తడిసిన దృశ్యాలు, ఛిద్రమైన శరీరాలు మరియు క్రూరమైన ఘర్షణలను చాలా బాగా ఎలివేట్ చేసింది. మిక్కీ జె మేయర్ సంగీతం విజువల్స్‌కు బలాన్ని ఇచ్చింది. ఈ చిత్రంలో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. మొత్తమ్మీద ఈ సినిమా ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను పెంచింది.

హిట్ 3 ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు