‘హిట్ – 3’ తో నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ ఖాయం : డైరెక్టర్ శైలేష్ కొలను

Published on Dec 6, 2022 1:02 am IST

అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా లేటెస్ట్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హిట్ 2. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా రూపొందిన ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ. 28 కోట్లకు పైగా కలెక్షన్ అందుకుని చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెంట్ దాటేసిన హిట్ 2 మూవీని మంచి యాక్షన్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీగా తెరకెక్కించారు దర్శకుడు శైలేష్.

ఇక హిట్ 2 మూవీకి అటు ఆడియన్స్ తో పాటు ఇటు సినీ ప్రముఖులు నుండి కూడా విపరీతంగా అభినందనలు వస్తుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. అయితే విషయం ఏమిటంటే, ప్రేక్షకాభిమానులు తమకు ఇంత పెద్ద సక్సెస్ అందించడం ఎంతో ఆనందంగా ఉందని, అలానే రాబోయే ఈ మూవీ సీక్వెల్ అయిన హిట్ 3 ని అంతకుమించేలా మరింత అద్భుతంగా తీస్తానని ఆడియన్స్ కి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రామిస్ చేస్తూ పోస్ట్ పెట్టారు శైలేష్ కొలను. తప్పకుండా హిట్ 3 ర్యాంపేజ్ మరో రేంజ్ లో ఉంటుందని ఆయన చెప్పారు. కాగా ఈ మూవీలో నాచురల్ స్టార్ నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా మూవీ గురించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :