యష్ సినిమా కోసం హాలీవుడ్ డైరెక్టర్!?

యష్ సినిమా కోసం హాలీవుడ్ డైరెక్టర్!?

Published on Jul 20, 2024 9:00 AM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన గత చిత్రాలు “కేజీయఫ్” (KGF Movie) తో పాన్ ఇండియా వైడ్ గా తాను ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇక ఇలాంటి సెన్సేషనల్ సక్సెస్ లు తర్వాత తాను ఎలాంటి సినిమా చేస్తాడా అనే సమయంలో కాస్త లేట్ గా అనౌన్స్ చేసిన భారీ చిత్రమే “టాక్సిక్”. మళయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో చేస్తున్న ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ నెలకొంది.

మరి ఆ క్రేజ్ కి తగ్గట్టు గానే ఊహించని ప్లానింగ్ లు మేకర్స్ చేస్తున్నారు. అలా తాజాగా హాలీవుడ్ ఎడిషన్ ఈ చిత్రానికి తోడైనట్టుగా తెలుస్తుంది. హాలీవుడ్ లో ది డార్క్ నైట్ (The Dark Knight), వార్ క్రాఫ్ట్, ఇన్సిప్షన్ (Insiption) తదితర భారీ చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అలాగే స్టంట్ నటుడు గా కూడా చేసిన టామ్ స్టర్తర్స్ టాక్సిక్ కోసం కూడా వర్క్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇతను ఈ సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్ అంటూ టాక్ వైరల్ గా మారింది. మొత్తానికి అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే గ్రాండ్ లెవెల్లో వెళ్లేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు