ఘ‌నంగా ‘హ‌నీమూన్ ఎక్స్ ప్రెస్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

ఘ‌నంగా ‘హ‌నీమూన్ ఎక్స్ ప్రెస్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

Published on Jun 14, 2024 8:30 AM IST

చైత‌న్య రావు, హెబ్బా ప‌టేల్ జంటగా తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’ ఇప్ప‌టికే అన్ని ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ఫ్యూచ‌రిస్టిక్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా ద‌ర్శ‌కుడు బాల రాజ‌శేఖ‌రుని తెర‌కెక్కించారు. ఇక ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను హైద‌రాబాద్ లోని ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఈ ఈవెంట్ కు స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్, ద‌ర్శ‌కుడు ద‌వ‌ర‌థ్, న‌టుడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ.. చైత‌న్య రావు, హెబ్బా ప‌టేల్ జోడీ బాగుంది. బాల మంచి డైరెక్ట‌ర్. హాలీవుడ్ లో సినిమాలు తీసి, ఇప్పుడు టాలీవుడ్ లోకి వ‌చ్చాడు. ఈ సినిమా అత‌డికి మంచి విజ‌యాన్ని అందించాలి.. అని అన్నారు.

డైరెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ మాట్లాడుతూ.. బాల ర‌జ‌శేఖ‌రుని నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. హాలీవుడ్ లో బ్లైండ్ యాంబిష‌న్స్, గ్రీన్ కార్డ్ ఫీవ‌ర్ వంటి సినిమాల‌ను తెర‌కెక్కించారు. ఇక్క‌డ ‘హ‌నీమూన్ ఎక్స్ ప్రెస్’ మూవీతో మ‌న‌ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా స‌క్సెస్ కావాల‌ని కోరుతున్నా.. అని అన్నారు.

అవ‌స‌రాల శ్రీ‌నివాస్ మాట్లాడుతూ… నేను ఫ‌స్ట్ వ‌ర్క్ చేసింది బాల గారి ద‌గ్గ‌రే. ఆయ‌న నాకు ఎన్నో మంచి విష‌యాల‌ను చెప్పారు. సినిమా రైటింగ్ గురించి మంచి సజెష‌న్స్ ఇచ్చారు. ఆయ‌న తెలుగులో తీసిన తొలి సినిమా గ్రాండ్ స‌క్సెస్ కావాల‌ని కోరుతున్నా.. అని అన్నారు.

న‌టి హెబ్బా ప‌టేల్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో చాలా ఎగ్జైటింగ్, ఇంట్రెస్టింగ్ జ‌ర్నీ చేశాం. ఈ సినిమాలోని కంటెంట్ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాం. ప్రేక్ష‌కులు ఈ సినిమాను ఆద‌రిస్తార‌ని కోరుతున్నా.. అని అన్నారు.

ఇక ద‌ర్శ‌కుడు బాల మాట్లాడుతూ.. హ‌నీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీకి ఇండ‌స్ట్రీ నుంచి చాలా మంది స‌పోర్ట్ చేస్తున్నారు. నాగార్జున‌, అమ‌ల‌, రాఘ‌వేంద్ర రావు గారు ఇలా.. చాలా మంది సెల‌బ్రిటీలు ఈ సినిమాకు స‌పోర్ట్ చేస్తున్నారు. తెలుగు సినిమా లెగసీని కొనసాగిస్తున్న ప్ర‌సాద్ ల్యాబ్స్ లోనే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయ‌డం సంతోషంగా ఉంది. వంద కోట్ల సినిమా అయినా పది కోట్ల రూపాయల సినిమా అయినా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు. కల్యాణి మాలిక్ పాటలు బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా.. అని అన్నారు.

కాగా ఈ ఈవెంట్ కు సింగ‌ర్స్ దీపు, స్పూర్తి జితేంద‌ర్, న‌టుడు కేఎల్ ప్ర‌సాద్, హీరో చైత‌న్య రావు త‌దిత‌రులు కూడా హాజ‌ర‌య్యారు. ఇక ఈ సినిమాను జూన్ 21న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు