సమీక్ష: “హనీమూన్ ఎక్స్‌ప్రెస్” – ఏ మాత్రం ఆకట్టుకొని రొమాంటిక్ డ్రామా

సమీక్ష: “హనీమూన్ ఎక్స్‌ప్రెస్” – ఏ మాత్రం ఆకట్టుకొని రొమాంటిక్ డ్రామా

Published on Jun 21, 2024 2:57 PM IST
Honeymoon Express Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 21, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: చైతన్య రావు, హెబ్బా పటేల్, సుహాసిని మణిరత్నం, తనికెళ్ల భరణి తదితరులు

దర్శకుడు: బాల రాజశేఖరుని

నిర్మాతలు : KKR, బాల రాజ్

సంగీత దర్శకుడు: కళ్యాణి మాలిక్

సినిమాటోగ్రఫీ: సిస్ట్లా వీఎంకే

ఎడిటింగ్: ఉమాశంకర్ జి, శ్రీ కృష్ణ అత్తలూరి

సంబంధిత లింక్స్: ట్రైలర్

చైతన్యరావు, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

కథ:

ఇషాన్ (చైతన్య రావు) మరియు సోనాలి (హెబ్బా పటేల్) తొలి చూపులోనే ప్రేమలో పడతారు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత, వారి మధ్య విభేదాలు మొదలవుతాయి. అనుకోకుండా, వారు బాల (తనికెళ్ళ భరణి) మరియు త్రిపుర సుందరి (సుహాసిని మణిరత్నం) అనే వృద్ధ జంటను కలుస్తారు. యువ జంట హనీమూన్ ఎక్స్‌ప్రెస్ రిసార్ట్‌ లో 7 రోజులు తిరిగి కనెక్ట్ అయ్యేందుకు మరియు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలని వీరు సూచించారు. ఇషాన్ మరియు సోనాలి రిసార్ట్‌లో ప్రత్యేకమైన అనుభవాలను నావిగేట్ చేస్తున్నప్పుడు, వారు తమ బంధాన్ని పరీక్షించే సవాళ్లను ఎదుర్కొంటారు. వారు ప్రేమగా మరియు అన్యోన్యంగా రిసార్ట్ నుండి బయలుదేరారా? లేదా? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

కళ్యాణి మాలిక్ చక్కగా కంపోజ్ చేసిన మెలోడీలు మాత్రమే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. బోరింగ్ గా సాగే ఈ చిత్రం లో పాటలు కొంచెం రిలీఫ్ గా అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

రొమాన్స్, ఫ్యూచరిస్టిక్, లవ్, మల్టీవర్స్, డ్రామా వంటి జానర్‌ల కలగలిపి ఉన్న మొదటి నుంచే విసుగు తెప్పించేలా ఉంటుంది. సరైన డైరెక్షన్ లేకపోవడంతో ప్రేక్షకులను చికాకుపెడుతుంది. ఒక్క సీన్ కూడా మొత్తం సినిమాలో ఆసక్తికి రేకెత్తించలేదు.

చైతన్య రావు, హెబ్బా పటేల్ ల నటన ఏ మాత్రం ఆకట్టుకోలేదు. రొమాంటిక్ సన్నివేశాల్లో చాలా ఇబ్బందికరంగా, ఫోర్స్డ్ గా నటిస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే సీనియర్ నటులు, తనికెళ్ల భరణి మరియు సుహాసిని మణిరత్నం వంటి టాలెంటెడ్ నటీనటుల నుంచి ఒక పేలవమైన, క్రింజ్ పెర్ఫామెన్స్ లను అందించడం బాధాకరం. ఇంత అనుభవం ఉన్న వారి నుంచే ఈ తరహా పాత్రలు అంటే ఖచ్చితంగా చాలా మందికి మింగుడు పడకపోవచ్చు.

ఇక సినిమాలో స్క్రీన్‌ప్లే గందరగోళం గా సాగుతుంది. దీనితో సినిమా చూసే ప్రేక్షకులకి అసలు ఏం జరుగుతుందో అర్ధం కానీ విధంగా అనిపిస్తుంది. అలాగే అసలు ఆడియెన్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారో అర్ధం కాదు. వీటితో అర్ధం కాని కథనం దారుణంగా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

ఈ చిత్రంలో సాంకేతిక విలువలు బాగాలేవు. పైన చెప్పినట్టుగా ఒక్క పాటలు మినహా మిగతా టెక్నికల్ వర్క్స్ నిరాశ పరుస్తాయి. ఆర్ పి పట్నాయక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు మెయిన్ గా సినిమాలో గ్రాఫికల్ వర్క్ కూడా చాలా తక్కువ క్వాలిటీతో కనిపిస్తుంది. అలాగే నిర్మాణ విలువలు కూడా సినిమాలో బాగోలేవు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “హనీమూన్ ఎక్స్ ప్రెస్” సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒక పరమ బోరింగ్ అనుభవాన్నే మిగులుస్తుంది అని చెప్పాలి. మెయిన్ లీడ్ సహా సీనియర్ నటీనటులు నుంచి కూడా ఒక భరించలేని పాత్రలు, నటన తీవ్రంగా నిరాశపరుస్తాయి. సినిమాలో ఏదన్నా మంచి విషయం ఉంది అంటే కళ్యాణ్ మాలిక్ సంగీతం అని చెప్పాలి. ఇది తప్ప సినిమాలో ఏ అంశం కూడా మెప్పించదు. అసలు సినిమాలో ఒక అర్ధవంతమైన కథని మించి రొమాంటిక్ క్రింజ్ సీన్స్ ఎక్కువయ్యాయి. వీటితో ఈ సినిమాని స్కిప్ చేసేయడమే బెటర్.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు