హీరో నితిన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాబిన్‌హుడ్’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించగా మరో బ్యూటీ కేతిక శర్మ ఓ హాట్ సిజ్లింగ్ సాంగ్‌లో తళుక్కుమంది.
‘అది దా సర్‌ప్రైజు’ అంటూ సాగే ఓ స్పెషల్ నెంబర్ సాంగ్‌లో ఈ బ్యూటీ తన డ్యాన్స్ అండ్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే, ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఇందులోని ఓ హూక్‌స్టెప్ వల్ల కొంతమేర వివాదం చెలరేగింది. మహిళలతో ఇలాంటి డ్యాన్స్ స్టెప్పులు వేయించడం ఏమిటంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మహిళా కమిషన్ వరకు చేరుకుంది. దీంతో వారు ఈ చిత్ర యూనిట్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు.
అయితే, నేడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఈ పాట వచ్చినప్పుడు అందులో వివాదానికి కారణమైన డాన్స్ స్టెప్స్ కనిపించలేదు. దీంతో ఆ హూక్‌స్టె్ప్ సీన్‌ను ట్రిమ్ చేశారని సినిమా చూసిన వారు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా రాబిన్‌హుడ్ మూవీపై బజ్ క్రియేట్ అయ్యేలా చేసిన ఈ వివాదాస్పద డ్యాన్స్ స్టెప్‌ను సైలెంట్‌గా కట్ చేసి నిజంగానే సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్.