ఓటిటి సమీక్ష: “హాట్ స్పాట్” తెలుగు డబ్ చిత్రం ‘ఆహా’ లో

ఓటిటి సమీక్ష: “హాట్ స్పాట్” తెలుగు డబ్ చిత్రం ‘ఆహా’ లో

Published on Jul 17, 2024 11:50 AM IST
Hot Spot Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 17, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: కలైయరసన్, సోఫియా, శాండీ, అమ్ము అభిరామి, జననీ లైయర్, గౌరీ జి కిషన్, ఆదిహ్య భాస్కర్, విఘ్నేష్ కార్తీక్ మరియు ఇతరులు.

దర్శకులు: విఘ్నేష్ కార్తీక్

నిర్మాతలు : అనీల్ కె రెడ్డి, ముని చంద్రారెడ్డి, ఇందు కుమార్ రెడ్డి

సంగీత దర్శకులు: సతీష్ రఘునాథన్ మరియు వాన్

సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్

ఎడిట‌ర్ : ముత్తయన్ యు

సంబంధిత లింక్స్: ట్రైలర్

రీసెంట్ గా తమిళ్ లో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించిన ఆంథాలజీ చిత్రం”హాట్ స్పాట్”. మరి ఈ చిత్రాన్ని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

ఇక కథలోకి వస్తే.. సినిమా దర్శకుడు కావాలని కోరుకునే ఓ యువ దర్శకుడు మహమ్మద్ షఫీ(విగ్నేష్ కార్తీక్) అసలు రొటీన్ కథలు విని విని చిరాకుగా ఉన్న ఓ నిర్మాత(బాల మణిమర్బన్) ని కలుస్తాడు. ఆ నిర్మాత షఫీకి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే ఇస్తాడు. ఈ సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ కథని చెప్పడం స్టార్ట్ చేస్తూ దానికి అదనంగా మరికొన్ని ఆసక్తికర కథలు స్టార్ట్ చేస్తాడు. మరి ఆ కథలు ఏంటి? నిర్మాతకు ఆ కథలు నచ్చాయా? విగ్నేష్ దర్శకుడు అయ్యాడా లేదా అనేవి తెలియాలి అంటే ఈ చిత్రంని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో డెఫినెట్ గా ఆంథాలజీ పాయింట్ మెప్పిస్తుంది అని చెప్పాలి. మొత్తం నాలుగు డిఫరెంట్ కథలు కనిపిస్తే ఈ నాలుగు కూడా చూసేందుకు డీసెంట్ గా అనిపిస్తాయి అలాగే ప్రతి కథ ఒక సమయంలో ఆలోచింపజేసేలా చేస్తాయి. అలాగే ఈ చిత్రంలో కనిపించే కథల్లో మొదటి కథ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అలాగే నాలుగో కథ ఫేస్ గేమ్ లు అమితంగా ఇంప్రెస్ చేస్తాయి.

సాలిడ్ ఎమోషన్స్ వాటిలో నడిచే కథనం మెప్పించి తీరుతాయి. అలాగే రెండూ కూడా రెండు సామజిక అంశాలతో ఆలోచింపజేసేలా అనిపిస్తాయి. మరి ఈ ఆంథాలజీలో నటీనటులు తమ పెర్ఫామెన్స్ లతో ఆకట్టున్నారని చెప్పాలి. 96 ఫేమ్ యువ నటి గౌరి జి కిషన్, అమ్ము అభిరామి, ఆదిత్య భాస్కర్ లు నాచురల్ పెర్ఫామెన్స్ లను ఈ ఆంథాలజీలో అందించారు. వీరితో పాటుగా జనని, సుభాష్ ఇంకా కలైయరసన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మంచి నటన కనబరిచారు.

మైనస్ పాయింట్స్:

ఈ ఆంథాలజీ చిత్రంలో దర్శకుడు అన్ని కథలు యూనిక్ కాన్సెప్ట్స్ గా తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ నాలుగింటిలో కూడా రెండు కథలు మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించే విధంగా అనిపించవు. మెయిన్ గా రెండు, నాలుగు కథలు కొంచెం పేలవంగా అనిపిస్తాయి రెండో కథ గోల్డెన్ రూల్స్ ఒకే కుటుంబానికి చెందిన ప్రేమకి సంబంధించి కనిపిస్తుంది. కానీ ఇది అంత ఎంగేజింగ్ గా అనిపించదు.

అలాగే మూడో కథ టమాటో చట్నీ అయితే ఫ్యామిలి ఆడియెన్స్ కి ఒకింత డిస్టబింగ్ గా అనిపించవచ్చు. ఇందులో కథనం కొంచెం ఇబ్బందికరంగా ఓవర్ గా అనిపిస్తుంది. దీని విషయంలో దర్శకుడు కొంచెం జాగ్రత్త వహించాల్సింది. ఇక వీటితో పాటుగా మూడు, నాల్గవ కథలు కొంచెం సాగదీతగా అనిపిస్తాయి. వీటిని కూడా కొంచెం తక్కువ రన్ టైం తో కట్ చెయ్యాల్సింది. అలాగే సినిమాలో కనిపించే అడల్ట్ ఫ్యాక్టర్ సీన్స్ కొంచెం లిమిటెడ్ గా పెట్టాల్సింది.

సాంకేతిక వర్గం:

ఈ ఆంథాలజీ చిత్రంలో ఒరిజినల్ తమిళ్ మేకర్స్ తీసుకున్న నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే తెలుగు డబ్బింగ్ సంబంధించి మన వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు కూడా బాగున్నాయని చెప్పాలి. డీసెంట్ డబ్బింగ్,క్లిక్ అయ్యింది. అలాగే సంగీతం బాగుంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో కొంచెం బెటర్ గా చేయాల్సింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.

ఇక దర్శకుడు విగ్నేష్ కార్తీక్ ఈ చిత్రానికి నటుడుగా మాత్రమే కాకుండా దర్శకునిగా కూడా డీసెంట్ వర్క్ అందించాడు అని చెప్పాలి. తన ఆలోచన ఈ సినిమా విషయంలో మెప్పిస్తుంది. ఆ రెండు కథలు ఇంకాస్త బాగా హ్యాండిల్ చేసి ఉంటే మరింత బెటర్ ఫీల్ ని ఈ చిత్రంతో తాను అందించేవాడు. అయినా కూడా ఇవి డీసెంట్ గా అనిపిస్తాయి.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ఆంథాలజీ చిత్రం “హాట్ స్పాట్” లో నాలుగు విభిన్నమైన కథలు కనిపిస్తాయి. వేటికవే మంచి యూనిక్ కాన్సెప్ట్ లు కానీ వేటలో రెండు మాత్రమే పూర్తి స్థాయిలో మెప్పించే విధంగా ఉన్నాయి. మిగతా రెండు కూడా ఇంకాస్త బెటర్ గా ప్రెజెంట్ చేస్తే బాగుండు. ఇంకా నటీనటుల పెర్ఫామెన్స్ లు కూడా బాగున్నాయి. వీటితో అయితే ఓటిటిలో కొంచెం స్లో అండ్ డిఫరెంట్ గా ఉన్నా పర్లేదు అనుకుంటే ఆహా లో ఈ ఆంథాలజీని ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు