సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్.. రాజమౌళి సినిమాలను అభిమానించే ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. ‘ఛత్రపతి’, ‘అరుంధతి’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’.. ఇలా పలు అద్భుతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ స్టార్ సినిమాటోగ్రాఫర్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘దిల్‌వాలే’ సినిమాలోని ఓ పాటకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ ఏడాది భారీ అంచనాలతో వస్తోన్న సినిమాల్లో ‘దిల్‌వాలే’ టాప్ ప్లేస్‌లో ఉంది.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతోన్న దిల్‌వాలే సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. షారూఖ్, కాజోల్, వరుణ్ ధావన్, కృతి సనన్.. ఇలా ప్రధాన తారాగణం పాల్గొంటుండగా ఈ షెడ్యూల్ జరుగుతోంది. ఇక ఈ సినిమా కోసం ఫిల్మ్‌సిటీలో ప్లాన్ చేసిన ఓ పాటకు సినిమాటోగ్రాఫర్‌గా సెంథిల్ కుమార్ వ్యవహరిస్తున్నారు. నృత్య దర్శకురాలు ఫరాహ్ ఖాన్ నేతృత్వంలో ఈ పాట రూపొందుతోంది. ఇక ఇప్పటివరకూ బాలీవుడ్‌లో ఒక్క సినిమా చేయకున్నా మంచి క్రేజ్ తెచ్చుకున్న సెంథిల్, బాలీవుడ్ బాద్‌షా హీరోగా చేస్తోన్న సినిమాలోని ఓ పాట ద్వారా బాలీవుడ్‌కు పనిచేయడం విశేషంగా కనిపిస్తోంది.