హృతిక్ – దీపిక రొమాంటిక్ సాంగ్ ఇష్క్ జైసా కుచ్ రిలీజ్!

హృతిక్ – దీపిక రొమాంటిక్ సాంగ్ ఇష్క్ జైసా కుచ్ రిలీజ్!

Published on Dec 22, 2023 6:54 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. వార్, పఠాన్ సినిమాల‌ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా రిలీజ్కు నెలరోజులే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్లు మొదలుపెట్టేశారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్తో పాటు ఫస్ట్ సింగిల్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సెకండ్ సింగిల్ ఇష్క్ జైసా కుచ్ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్మీడియాలో వైరల్గా మారింది. సాంగ్లో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ఫుల్ రొమాటింక్ మోడ్‌లో ఉండ‌గా.. వారిద్ద‌రీ కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

సాంగ్లో హృతిక్ రోషన్ డ్యాన్స్ స్టెప్పులు అదిరిపోయాయని నెటిజన్లు అంటున్నారు. హృతిక్ ఫిజిక్కు ఫిదా అయ్యామని చెబుతున్నారు. ఈ సాంగ్ హృతిక్ పాటల్లో వన్ ది బెస్ట్ అవ్వనుందని అంటున్నారు. దీపిక కూడా అదరగొట్టేసిందని కామెంట్లు చేస్తున్నారు.

సాధారణంగా హృతిక్‌ రోషన్ అంటేనే అమ్మాయిలు పడి చస్తారు. దీపికా పదుకొణెకు పాన్ ఇండియా రేంజ్ లో ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో మనకు తెలిసిందే. ఆమె అందాన్ని ఓ స్థాయిలో ఆరాధిస్తారు. అలాంటి ఇద్దరు కలిసి ఇలాంటి ఒక రొమాంటిక్ సాంగ్ చేయడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అందరి దృష్టి పడిందని బీటౌన్లో టాక్.

ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా క‌నిపించ‌నుండ‌గా.. స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా (దీపికా పదుకొనే)గా కనిపించనున్నారు. గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్‌ కపూర్‌ సందడి చేయనున్నారు. అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు