“దేవర” కోసం బాలీవుడ్ గ్రీక్ గాడ్ కూడా?

“దేవర” కోసం బాలీవుడ్ గ్రీక్ గాడ్ కూడా?

Published on Sep 10, 2024 11:01 PM IST

మళ్ళీ చాలా రోజుల తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం “దేవర” అనే చెప్పి తీరాలి. తన స్టార్డంతో పాన్ ఇండియా వైడ్ ఈ సినిమాపై సాలిడ్ బజ్ ని తెచ్చుకున్న తారక్ ఇప్పుడు ఈ సినిమాకి ఇండియా వైడ్ నాన్ స్టాప్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మెయిన్ గా నార్త్ మార్కెట్ లో గట్టి ప్రమోషన్స్ ని క్రేజీ ప్లానింగ్ లతో దూసుకెళ్తున్న తారక్ మరో ఊహించని ఇంటర్వ్యూలో కనిపించనున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతం తారక్ చేస్తున్న భారీ చిత్రాల్లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో “వార్ 2” అనే సెన్సేషనల్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇపుడు ఇదే హృతిక్ రోషన్ దేవర కోసం వస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ నిజమైతే మాత్రం ఓ క్రేజీ ఇంటర్వ్యూగా ఇది నిలిచిపోతుంది అని చెప్పాలి. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు