ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడం కష్టం – హృతిక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘వార్-2’లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. దీంతో హృతిక్, ఎన్టీఆర్‌ల మధ్య వచ్చే సీన్స్ ఎలా ఉండబోతున్నాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అయితే, ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్‌ల మధ్య యాక్షన్ మాత్రమే కాకుండా ఓ సాలిడ్ డ్యాన్స్ నెంబర్ కూడా ఉందట. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన షూటింగ్‌ను జరిపేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే, ఈ పాటలో ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడం కష్టమని హృతిక్ తాజాగా వెల్లడించారు. ‘ఆర్ఆర్ఆర్’లో నాటు నాటు సాంగ్‌లో ఎన్టీఆర్ డ్యాన్స్ తాను చూశానని.. ఆయనలా స్పీడ్‌గా డ్యాన్స్ చేయాలంటే తన కాళ్లు బలంగా ఉండేలా చూసుకోవాలని హృతిక్ తాజాగా అన్నారు.

దీంతో ఈ ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్ల మధ్య వచ్చే సాంగ్‌లో ఎలాంటి స్టెప్స్ ఉండబోతున్నాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version