విడుదల తేదీ : జనవరి 25, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: హృతిక్ రోషన్, దీపికా పదుకోన్, అనిల్ కపూర్, రిషబ్ సాహ్ని, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్
దర్శకుడు : సిద్ధార్థ్ ఆనంద్
నిర్మాతలు: సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, రామన్ చిబ్, అజిత్ అంధరే, అంకు పాండే, కెవిన్ వాజ్, మమతా భాటియా
సంగీత దర్శకులు: విశాల్ శేఖర్, సంచిత్ బల్హార, అంకిత్ బల్హార
సినిమాటోగ్రఫీ: సచ్చిత్ పౌలోస్
ఎడిటింగ్: ఆరిక్ షేక్
సంబంధిత లింక్స్: ట్రైలర్
బాలీవుడ్ సినిమా నుంచి ఈ ఏడాది వచ్చిన మొదటి పెద్ద చిత్రం “ఫైటర్”. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వస్తే..భారత వైమానిక దళం శ్రీనగర్ లో తమ బేస్ క్యాంపు పై శత్రువులు దాడులు చేయవచ్చు అనే వార్తని పసిగడతారు. మరి ఇలాంటి సవాళ్ళని ఎదుర్కోడానికి రాకేష్ జై(అనిల్ కపూర్) తన అండర్ లో కొందరు పదునైన సోల్జర్స్ ప్యాటీ గా పిలవబడే షంషేర్ పటానియా(హృతిక్ రోషన్) అలాగే మిన్నీ రాథోర్(దీపికా పదుకోన్) ఇంకా సర్తాజ్ గిల్(కరణ్ సింగ్ గ్రోవర్) లతో ఒక టీం ని తయారు చేస్తాడు. అయితే ఓ రోజు ఉగ్రవాద నాయకుడు జైష్ ఈ మహమ్మద్ ఈ ఆర్ పి ఎఫ్ సోల్జర్స్ పై అమానుష దాడులు జరుపుతాడు. మరి దీనితో భారత్ కి ఆ ఉగ్రవాదుల మధ్య భీకర పోరాటానికి రంగం సిద్ధం అవుతుంది. మరి ఈ క్రమంలో ప్యాటీ అండ్ టీం ఏం చేశారు. యుద్ధంలో ఎవరు గెలిచారు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
మాములుగా సిద్ధార్థ్ ఆనంద్ చిత్రాలు అంటేనే గొప్ప కథ అనేది లేకపోయినా తన నరేషన్ తో అదరగొడతాడు అని అందరికీ తెలుసు. సరిగ్గా ఇదే ఫార్మాట్ లో “ఫైటర్” చిత్రంలో కథనం కూడా కనిపిస్తుంది. ఇక ఆల్రెడీ హీరో హృతి రోషన్ తో ఇద్దరికీ సాలిడ్ హిట్ ట్రాక్ నుంచి హృతిక్ ని ఎలా వాడాలో కూడా సిద్ధార్థ్ కి బాగా తెలుసు. మరి అలా తమ గత రెండు సినిమాలకంటే ఎక్కువగానే ఈ సినిమాలో ప్యాటీగా హృతిక్ ని తాను నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేసాడు అని చెప్పాలి.
హృతిక్ పర్సనాలిటీని సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆవిష్కరించడమే కాకుండా తన నుంచి గత రెండు సినిమాల్లో కంటే బెస్ట్ పెర్ఫార్మర్ ను కూడా సిద్ధార్థ్ ప్రెజెంట్ చేసాడు. దీనితో తన ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా కూడా డిజప్పాయింట్ అవ్వరు. ఇక నటి దీపికా పదుకోన్ మరోసారి తన గ్లామ్ షోతో మాత్రమే కాకుండా నటిగా కూడా తనలోని వెర్సటాలిటీ ప్రదర్శించింది అని చెప్పాలి.
ఇంకా అనీల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్ కరణ్ సింగ్ గ్రోవర్ తదితరులు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక ఈ సినిమాలో మరి మేజర్ హైలైట్స్ ఏమిటంటే సిద్ధార్థ్ యాక్షన్ టేకింగ్ మరియు ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసిన విధానం అని చెప్పాలి. మామూలుగా గానే సిద్ధార్థ్ ఆనంద్ సినిమా అంటే యాక్షన్ మూవీ లవర్స్ ఒక ఒక ట్రీట్ అలాంటిది ఈ సినిమాలో ఎయిర్ ఫోర్స్ తో అయితే తన విజన్ లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ లని చూపించి ఆశ్చర్యపరుస్తాడు. అలాగే మన దేశానికి సంబంధించి ఎమోషన్స్ తాను క్యారీ చేయడంలో ఎప్పుడూ తన మార్క్ చూపిస్తాడు అదే విధంగా ఈ సినిమలో ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
మొదట చెప్పుకున్నట్టే ఈ చిత్రంలో కూడా గొప్ప కథ ఏమి కనిపించదు. అలాగే సినిమాలో నరేషన్ కి తగ్గట్టుగా సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా పడాల్సింది. కానీ ఇది ఈ చిత్రంలో వీక్ గా ఉంటుంది. అలాగే కొన్ని సీన్స్ అయితే మనం ఆల్రెడీ చూసిన కొన్ని దేశ భక్తి చిత్రాల్లో చూసినట్టు అనిపిస్తుంది. అలాగే ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్లాక్ ని ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది. వీటితో పాటుగా గ్రాఫిక్స్ బాగున్నాయి కానీ ఇంకా బెటర్ గా చేయాల్సింది.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా ఉన్నాయని చెప్పాలి. అలాగే టెక్నికల్ టీం లో మ్యూజిక్ వర్క్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. అలాగే విజువల్స్ ఎఫెక్ట్ కూడా బావున్నాయి. ఇంకా యాక్షన్ టీం ఎఫర్ట్స్ ని మాత్రం మెచ్చుకోవాలి. అలాగే సెట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా బానే ఉంది.
ఇక దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ విషయానికి వస్తే.. తాను మళ్ళీ రొటీన్ కథాంశాన్నే ఎంచుకున్నాడు కానీ దానిని తెరకెక్కించిన తీరుతో మెప్పిస్తాడు. యాక్షన్ సహా ఎమోషన్ ని కూడా సమపాళ్ళలో క్యారీ చేస్తూ గ్రాండ్ ట్రీట్ ని అందించాడు. దీనితో ఈ సినిమా విషయంలో తాను సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఫైటర్” చిత్రంలో గ్రాండ్ యాక్షన్ ఎలిమెంట్స్ సహా మాతృభూమిపై ప్రతీ భారతీయుడికి ఉండే ఎమోషన్స్ ని ఆకట్టుకునే విధంగా చూపించిన సాలిడ్ ట్రీట్ అని చెప్పవచ్చు. హృతిక్ తో సిద్ధార్థ్ చేసిన ఈ ప్రయత్నం మరోసారి మెప్పిస్తుంది. దీనితో ఈ కాంబినేషన్ లో మరో సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ట్రీట్ ని చూడాలి అనుకునేవారు ఈ చిత్రాన్ని ఈ వారాంతంలో తప్పకుండా చూడవచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team