‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2′. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హృతిక్ రోషన్ ‘వార్2’తో పాటు ఎన్టీఆర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఇంతకీ, హృతిక్ ఏం మాట్లాడారు అంటే.. ‘వార్ 2’ షూటింగ్ కు సంబంధించి ప్రతి షెడ్యూల్ ఎంతో పర్‌ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో పనిచేయడం వల్ల ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాను. ఎన్టీఆర్ కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అంటూ హృతిక్ తెలిపారు.
కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.