దేశం అంతటా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్బంగా హృతిక్ రోషన్ తండ్రి, నిర్మాత రాకేశ్ రోషన్ భారీగా నూతన సంవత్సర పార్టీని నిర్వహించారు. ఈ పార్టీ కి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో క్రేజీగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హృతిక్ తన తొలి చిత్రం ‘కహో నా ప్యార్ హై’ నుండి ఒక పాటని ఆలపించటం దీనికి కారణం. ఈ వీడియోని సింగర్ మికా సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేశారు, వీరిద్దరూ ‘ఏక్ పాల్ కా జీనా’ను కలిసి పాడుతూ డాన్స్ వేస్తూ సందడి చేశారు.
వీడియోను పోస్ట్ చేస్తూ మికా సింగ్ ” హృతిక్ రోషన్, జాయెద్ ఖాన్, కరణ్ బావా మరియు రాకేశ్ రోషన్ లకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. 2020కి వీడ్కోలు పలుకుతూ, 2021కి స్వాగతం చెప్తూ…ఇంత అద్భుతమైన పార్టీ హోస్ట్ చేసినందుకు కుకు బావా సాబ్ మరియు రాకేశ్ రోషన్ కు ధన్యవాదాలు తెలియచేసారు. ఈ వీడియోని పోస్ట్ చేయటానికి కొంత సమయం ముందు “నా బ్రో హృతిక్ రోషన్ తో కొత్త సంవత్సరాన్నీ ఎలా ఎంజాయ్ చేస్తున్నామో చూడటానికి నా ఇన్‌స్టాగ్రామ్ ని గమనిస్తూ ఉండమని, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు” అని మికా సింగ్ పోస్ట్ చేశారు.
https://www.instagram.com/tv/CJeEznxjQ1K/?utm_source=ig_embed