‘ఆల్ఫా’లో అలియా గురువుగా హృతిక్‌

‘ఆల్ఫా’లో అలియా గురువుగా హృతిక్‌

Published on Aug 19, 2024 11:32 AM IST

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ అలియా ప్రధాన పాత్రలో ‘ఆల్ఫా’ అనే చిత్రాన్ని శివ్‌ రావేల్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న మొదటి మహిళా గూఢచారి చిత్రమిది. శార్వరీ వాఘ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లో స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌.. అలియా గురువు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హృతిక్‌ రోషన్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణను కూడా మొదలుపెట్టినట్లు టాక్ నడుస్తోంది. మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో కశ్మీర్‌లో రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ను మొదలుపెట్టడానికి కసరత్తులు చేస్తుంది. అన్నట్టు ఈ సినిమాలో అనిల్‌ కపూర్, బాబీ దేవోల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు