సిస్టర్ సంచలన ఆరోపణలపై స్పందించిన హృతిక్ రోషన్.

సిస్టర్ సంచలన ఆరోపణలపై స్పందించిన హృతిక్ రోషన్.

Published on Jul 10, 2019 6:51 AM IST

హృతిక్ రోషన్ నటించిన “సూపర్” 30 మూవీ ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. ఆనంద్ కుమార్ అనే ఓ సాధారణ మేథమెటీషియన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ వికాస్ బాహ్ల్ తెరకెక్కిస్తాన్నారు. దీనితో ఈ మూవీ ప్రొమోషన్స్ లో బిజీగా పాల్గొంటున్న హృతిక్ కి కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇటీవల హృతిక్ సిస్టర్ సునైనా రోషన్ సొంత కుటుంబంపై పబ్లిక్ గా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. తాను ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమించడంతో హృతిక్ రోషన్ తో పాటు తన కుటుంబంలోని వారందరు తనని మానసికంగా హింసిస్తున్నారంటూ చెప్పడం జరిగింది.

ఇంత వరకు ఈ విషయంపై స్పందించని హృతిక్ నేడు మాట్లాడారు. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి బదులుగా నా సిస్టర్ ఇప్పుడున్న మానసిక స్థితిని బట్టి నేను ఈ విషయంలో ఏమి మాట్లాడలేను. ఇది కేవలం మా కుటుంబానికి సంబందించిన వ్యక్తిగతమైన,సున్నిత అంశం. అలాగే మతం అనేది మా కుటంబంలో అసలు పట్టింపులేని అంశం అన్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు