అనిల్ రావిపూడి.. కమర్షియల్ ఫార్ములాను ఫాలో అయ్యే దర్శకుల్లో ఫన్ మీద ఎక్కువగా దృష్టిపెట్టే డైరెక్టర్. ఆయన చేసిన సినిమాలు కూడా వరుసగా బ్లాక్ బస్టర్ విజయాల్ని సాధించాయి. అందుకే ఆయనకు డిమాండ్ బాగా పెరిగింది. చిన్న హీరోల దగ్గర్నుండి స్టార్ హీరోల వరకు అందరూ ఆయనతో వర్క్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా పూర్తిస్థాయి ఎంటెర్టైనర్ చేయాలనుకునే ఆలోచన ఉన్న హీరోలు అనిల్ రావిపూడిని మొదటి ఛాయిస్ కింద చూస్తున్నారు.
ఇప్పటికే బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు రావిపూడితో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు రాగా తాజాగా రామ్ చరణ్ సైతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ యాక్షన్, ఫన్ జానర్లో చేయాలనుకుంటున్నారని, అందుకే రావిపూడితో టచ్లో ఉన్నారని టాక్ వినబడుతోంది. అయితే రావిపూడి మాత్రం తన తర్వాతి చిత్రంగా ‘ఎఫ్ 3’ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆయన ఆ ప్రాజెక్టే చేస్తారో లేకపోతే తన కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరోల్లో ఎవరితోనైనా సినిమా కమిటవుతారో చూడాలి.
Star heroes waiting for Anil Ravipudi