యాక్ష‌న్ మూడ్ లో ‘విశ్వంభ‌ర’..!

యాక్ష‌న్ మూడ్ లో ‘విశ్వంభ‌ర’..!

Published on Jun 25, 2024 1:26 PM IST

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభ‌ర’ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ మ‌ల్లిడి వశిష్ఠ తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ మూవీపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. పూర్తి సోషియో ఫాంట‌సీ మూవీగా విశ్వంభ‌ర వ‌స్తుండ‌టంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైదరాబాద్ లో జ‌రుగుతోంది. ప్ర‌స్తుత షెడ్యూల్ ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు యూనిట్. ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ ను రామ్-ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్లు కొరియోగ్ర‌ఫీ చేస్తున్నారు. చిరుతో పాటు ప‌లువురు కీల‌క ఆర్టిస్టులు కూడా ఈ షూట్ లో పాల్గొంటున్నారు.

కాగా, విశ్వంభ‌ర సినిమా కోసం మెగాస్టార్ ఓ స‌రికొత్త లుక్ లోకి మారారు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్నారు మేక‌ర్స్. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు