ప్రస్తుతం గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక శంకర్ సినిమాలు అంటేనే ఓ రేంజ్ గ్రాండియర్ అని అందరికీ తెలుసు. అలాగే తన సినిమాల్లో పాటలు గాని యాక్షన్ బ్లాక్ లు గాని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అయితే ఇప్పుడు చరణ్ తో గేమ్ ఛేంజర్ కోసం కూడా శంకర్ భారీ ఖర్చుతో నెక్స్ట్ లెవెల్ విజువల్స్ కలిగిన సాంగ్స్ ని తెరకెక్కించినట్టుగా లేటెస్ట్ గా నిర్మాత దిల్ రాజు రివీల్ చేశారు.
సినిమాలో సాంగ్స్ అన్నీ వావ్ అనిపించేలా ఉంటాయి అని అలాగే ఈ సినిమా తమ బ్యానర్ లో 50 వ సినిమా కాబట్టి ఖర్చుకి వెనకాడకుండా ఒకో సాంగ్ కి గాను 10 నుంచి 12 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా షాకింగ్ ఫిగర్స్ ని దిల్ రాజు రివీల్ చేశారు. దీనితో శంకర్ నుంచి మళ్ళీ మరో క్రేజీ ట్రీట్ ఆడియెన్స్ కి రాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అయితే థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాను కూడా ఈ సినిమా సాంగ్స్ వేరే లెవెల్లో ఉంటాయని చెప్పాడు.


