“గాడ్ ఫాథర్” బిజినెస్ మాత్రం భారీ గానే.!

Published on Sep 22, 2022 8:00 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “గాడ్ ఫాథర్” కోసం అందరికి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధం కాగా సినిమాపై లేదు అని అనుకుంటున్నా హైప్ ని మెగాస్టార్ చిన్న డైలాగ్ తోనే రచ్చ లేపి వదిలేసారు. దీనితో తెలుగు రాష్ట్రాల్లో గాడ్ ఫాథర్ కి భారీ హైప్ మొదలు కాగా ఈ క్రమంలో ఈ సినిమాపై మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

ఆల్రెడీ ఈ సినిమాకి హిందీ మరియు తెలుగు ఓటిటి హక్కులు సెన్సేషనల్ ఫిగర్ కి అమ్ముడుపోగా ఇప్పుడు ఓవర్సీస్ బిజినెస్ కి సంబంధించి బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి హిందీ మరియు తెలుగులో కలిపి ఓవర్సీస్ లో 2 మిలియన్ మేర టార్గెట్ సెట్ అయ్యినట్టు తెలుస్తుంది.

మరి లాస్ట్ ఆచార్య అందుకున్న ఫలితంతో ఇది అయితే ఒకింత ఎక్కువే అని చెప్పాలి. అలాగే ఓటిటి కూడా ఎలాంటి రేట్ పలికింది కూడా చూసాం, ఇంకా థియేట్రికల్ ఇతర హక్కులు కలిపి కూడా మొత్తంలోనే జరిగింది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుని ఈ మొత్తాన్ని క్రాస్ చేస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :