ఆ బ్లాక్‌బస్టర్ రీమేక్ హక్కులు ఎవరికి దక్కుతాయ్!?

ఆ బ్లాక్‌బస్టర్ రీమేక్ హక్కులు ఎవరికి దక్కుతాయ్!?

Published on Jun 9, 2016 6:17 PM IST

Sairat-Movie
ఏదైనా భాషలో ఓ సినిమా సూపర్ హిట్ అయితే సాధారణంగా ఇతర భాషల్లో ఆ సినిమాను రీమేక్ చేసే విషయంలో దర్శక, నిర్మాతలు పోటీ పడుతూండడం జరుగుతూండేదే! తెలుగులో కూడా పరభాషా చిత్రాలను రీమేక్ చేయడమనేది ఇప్పటికీ మంచి సక్సెస్ ఫార్ములా. ఇక ఈ నేపథ్యంలోనే మరాఠీలో ఘన విజయం సాధించిన ‘సయరత్’ అనే సినిమా కోసం పెద్ద ఎత్తున నిర్మాతలు పోటీపడుతూండడం విశేషంగా చెప్పుకోవాలి. ఈమధ్యే విడుదలైన ఈ సినిమా మరాఠీలో బాక్సాఫీస్ ప్రభంజనంగా నిలిచింది.

సుమారు 4-5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 60 కోట్లకు పైనే వసూళ్ళు రాబట్టి మరాఠీ చిత్ర పరిశ్రమలో చరిత్ర తిరగరాసింది. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు పలు పెద్ద ప్రొడక్షన్ సంస్థలు పోటీపడుతున్నాయి. నిర్మాత చంటి అడ్డాల ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నట్లు, అన్నీ కుదిరితే తన నిర్మాణంలో ఈ సినిమా త్వరలోనే రెడీ అవుతుందని తెలిపారు. అయితే ఇక్కడే మరో ఆసక్తికర కథనం కూడా వినిపిస్తోంది. సయరాత్ సినిమాను నిర్మించేప్పుడే తెలుగు, మరాఠీల్లో ఏకకాలంలో చిత్రీకరించారని, తెలుగులోనూ తామే స్వయంగా విడుదల చేస్తామని మరాఠీ నిర్మాతలు చెబుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతుందా? అయితే రీమేక్ హక్కులు ఎవరికి సొంతం అవుతాయి? అన్నది ఆసక్తికర ప్రశ్న!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు