క్రేజీ..పవన్ “జల్సా”కి అంతకంతకు భారీ స్థాయి డిమాండ్..!

క్రేజీ..పవన్ “జల్సా”కి అంతకంతకు భారీ స్థాయి డిమాండ్..!

Published on Aug 31, 2022 7:05 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొత్త సినిమా థియేటర్స్ లో వస్తుంది అంటే ఏ లెవెల్లో ఉంటుందో అది అందరికీ తెలుసు. అయితే ఈసారి మాత్రం తన ఆల్రెడీ రిలీజ్ అయ్యిన సినిమా మళ్ళీ రీ రిలీజ్ కావడం అనేది వేరే లెవెల్లో కనిపిస్తుంది. ఈ సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా “జల్సా” సినిమాని అప్డేట్ చేసి రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు.

అయితే ఈ సినిమాకి రికార్డు బ్రేకింగ్ లెవెల్లో రెస్పాన్స్ కనిపించడం విశేషం. దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీ డిమాండ్ ఈ సినిమాకి అంతకంతకు నెలకొంటుందని ఇప్పుడు తెలుస్తుంది. మరి దీనితో అనేక చోట్ల ఒక రోజులో రెండు షోలకి బదులు నాలుగు షో లు కూడా ప్రదర్శిస్తున్నారట. దీనితో ఈ సినిమాకి ఉన్న డిమాండ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి సంజయ్ సాహు అయితే ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు