తెలుగు బయ్యర్లకు ‘ది గోట్’ నష్టాలు తప్పవా..?

తెలుగు బయ్యర్లకు ‘ది గోట్’ నష్టాలు తప్పవా..?

Published on Sep 12, 2024 1:01 AM IST

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గోట్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హైప్‌తో రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు పూర్తి స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాకు ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా ఆ స్థాయిలో జరిగింది.

‘ది గోట్’ చిత్రాన్ని తెలుగులోనూ మంచి అంచనాల మధ్య రిలీజ్ చేశారు. సాధారణంగానే విజయ్ సినిమాలంటే మంచి క్రేజ్ ఉండే తెలుగునాట ‘ది గోట్’ వెనుకబడింది. రిలీజ్ రోజున పర్వాలేదు అనిపించిన కలెక్షన్స్ వీకెండ్, ఆ తరువాత కోలుకోలేకపోయాయి. దీంతో ఈ సినిమా తెలుగు బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చనుందనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో ఈ వారం పలు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ‘ది గోట్’కు కష్టకాలం రానుందని సినీ సర్కిల్స్‌లో చర్చించుకుంటున్నారు.

‘ది గోట్’ చిత్రాన్ని మైత్రీ మూవీస్ వారు డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ, ఈ నష్టం ఎంత ఉంటుందనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రభుదేవా, లైలా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు