‘గేమ్ ఛేంజర్’ కోసం రికార్డు స్థాయిలో ప్రీమియర్స్..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ప్రీమియర్ షోస్ ఉంటాయా లేదా.. అనేది మెగా ఫ్యాన్స్‌లో నెలకొన్న ప్రశ్న. ఈ ప్రశ్నకు నిర్మాత దిల్ రాజు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కోసం ప్రీమియర్ షోలు ఖచ్చితంగా ఉంటాయని.. అయితే, పక్కా ప్లానింగ్‌తో రికార్డు స్థాయిలో ఈ ప్రీమియర్ షోలు ఉంటాయని దిల్ రాజు తెలిపారు.

ఇటీవల ‘పుష్ప-2’ ప్రీమియర్ షో లో జరిగిన విషాదం దృష్టిలో పెట్టుకుని, గేమ్ ఛేంజర్ కోసం పక్కాగా ఈ ప్రీమియర్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు

Exit mobile version